AP: సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ శనివారం ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు.. మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? ఇది కరెక్టేనా? ప్రజలకు మీరు ఇచ్చి వాగ్ధానాల అమలు కోసం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైసీపీ వారి తరఫున నిలబడుతుంది.’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.