కెనడాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. విశాఖలోని గాజువాకకు చెందిన పిల్లి నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు ఫణికుమార్(33) ఎంఎస్ చదివేందుకు ఇటీవల కెనడా వెళ్లాడు. అయితే ఈ నెల 14న నాగప్రసాద్‌కు ఫణికుమార్ రూమ్‌మేట్ ఫోన్ చేసి అతడు గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.