నేడు ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

82చూసినవారు
నేడు ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
AP: సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. అలాగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

సంబంధిత పోస్ట్