హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో సోలంగ్ వ్యాలీలో ఓ చిన్న ట్రక్కుకు రోడ్డుపై పట్టు దొరకక పోవడంతో వెనక్కి జారుకుంటూ వెళ్లింది. దీంతో ప్రమాదాన్ని ముందే గ్రహించిన ట్రక్కు డ్రైవర్ కిందకు దూకేయగానే.. ఆ ట్రక్కు చూస్తుండగా లోయలో పడిపోయింది. కాగా, డిసెంబర్ నెల ప్రారంభంలో అటల్ టన్నెల్ వద్ద ఇదే తరహాలో థార్ వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.