విజయవాడలో మహాసభల నిర్వహణ తెలుగువారందరికీ గర్వకారణం: సీఎం

75చూసినవారు
విజయవాడలో మహాసభల నిర్వహణ తెలుగువారందరికీ గర్వకారణం: సీఎం
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణపై సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు. "విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోంది." అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్