AP: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని CM చంద్రబాబు పేర్కొన్నారు. బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను పూర్తిగా అరికట్టేలా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం గంజాయి సాగు, నేరాలు తగ్గాయని తెలిపారు. నేరాలను తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలన్నారు.