ఢిల్లీ సీఎం రేఖాగుప్తా హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై తన కాన్వాయ్‌ను ఆపారు. ఆశ్రయం లేకుండా నడిరోడ్డుపై తిరుగుతున్న పశువులను చూసి ఆమె తన కారు నుంచి దిగారు. అలా రోడ్లపై తిరుగుతున్న పశువులకు సరైన ఆశ్రయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.