ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు CMగా ఉన్నప్పుడు ‘ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు, ఉన్నదంతా టూరిజమే' అని చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అయ్యాయని CPI MLA కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆ మాటలను CM చంద్రబాబు ప్రస్తావించారు. ఆనాడు తనపై విరుచుకుపడ్డారని, తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30ఏళ్లు పట్టిందని అన్నారు. ఇప్పుడు అంత సమయం లేదని, త్వరగా ప్రాజెక్ట్‌లు తెచ్చి.. ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని CM అన్నారు.