నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల తర్వాత గుడివాడ మునిసిపల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ ను ఆయన ప్రారంభించారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి క్యాంటీన్ లో భోజనం వడ్డించారు. ఆపై తాము కూడా టోకెన్ తీసుకుని భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు.