జనసేన అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు

83చూసినవారు
జనసేన అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించారు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా కలుసుకున్న వాలంటీర్లపై జనసైనికులు దాడి చేశారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అభ్యర్థి పంతం నానాజీ తన కార్యకర్తలతో కలిసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వారిని నిర్భంధించారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్