’గత ప్రభుత్వం కేంద్ర పథకాలను సరిగా వినియోగించలేదు. స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధులను మళ్లించారు. స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేశారు‘ అని సీఎం చంద్రబాబు అన్నారు. 33 విభాగాల్లో ఉన్న రూ.4,700 కోట్లు మళ్లించారు. స్పెషల్ మార్జిన్ పేరుతో రూ.20,676 కోట్లు ఏపీఎస్‌బీసీఎల్‌కు మళ్లించారు. ఏఆర్‌ఈటీ పెట్టి రూ.14,275 కోట్లు మళ్లించారు. 15 ఏళ్ల ఆదాయం మళ్లించేందుకు ఏఆర్‌ఈటీ పెట్టారన్నారు.