ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ పవన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని పవన్ పిలుపునిచ్చారు.