సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల కోసం ఏ గడ్డి అయినా తినడానికి చంద్రబాబు వెనకాడరని అన్నారు. 'తల్లిదండ్రులు బతికుండగా ఎప్పుడైనా వారిని ప్రజలకు చూపించావా? వారిని నీ ఇంటికి పిలిచి రెండు పూటలా భోజనం పెట్టి సంతోషంగా పంపించావా? ఒక్కసారైనా కలిసి ఉన్నావా? కనీసం వారు చనిపోయిన తర్వాత తలకొరివి పెట్టావా?' అని జగన్ నిలదీశారు.