కలియుగాంతాన్ని సూచించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

76చూసినవారు
కలియుగాంతాన్ని సూచించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
కలియుగం ఎప్పుడు అంతమవుతుందో చెప్పే ఆలయం ఉందని మీకు తెలుసా? అవును.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగఢ్ అనే కొండకోటలో కేదారేశ్వర దేవాలయం ఉంది. ఈ ఆలయ స్తంభాలు నాలుగు యుగాలను సూచిస్తాయని పురోహితులు చెబుతున్నారు. సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం ముగిసినట్లు ఈ ఆలయంలో ఉన్న మూడు స్థంభాలు ఇప్పటికే విరిగిపోయాయట. అయితే మిగిలిన నాలుగో స్థంభం ఎప్పుడైతే విరిగిపోతుందో అప్పుడు కలియుగం కూడా అంతమవుతుందని పురోహితులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్