5.8 కోట్ల నకిలీ రేషన్‌ కార్డులు తొలగింపు: కేంద్రం

59చూసినవారు
5.8 కోట్ల నకిలీ రేషన్‌ కార్డులు తొలగింపు: కేంద్రం
దేశంలో భారీగా రేషన్ కార్డులు రద్దయినట్టు కేంద్రం తెలిపింది. దేశంలో మొత్తంగా 80.6 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా.. ఆధార్‌ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్‌ కార్డులను గుర్తించినట్టు పేర్కొంది. వీటిని తొలగించినట్టు చెప్పింది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్‌ కార్డుల డిజిటలీకరణ పూర్తయ్యింది.

సంబంధిత పోస్ట్