అనంత టీడీపీలో అసమ్మతి జ్వాలలు

66చూసినవారు
అనంత టీడీపీలో అసమ్మతి జ్వాలలు
టికెట్ల కేటాయింపులో సీనియర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కలేదు. దాంతో వైకుంఠం ప్రభాకర్ వర్గీయులు అనంతపురం జిల్లాలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. అలాగే సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా అనంతపురం ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు.

సంబంధిత పోస్ట్