రాజస్థాన్ డీప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా తనయుడు ఆషు తన ఫెండ్స్‌తో కలిసి ఓ రీల్ చేశాడు. అందులో వెనుక నుంచి పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. ఓపెన్ టాప్ జీపులో వీధుల్లో తిరుగుతూ అషు చిల్ అవుతున్నాడు. అంతేగాక ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా జీపును నడుపుతున్నారు. ఆ ఎస్కార్ట్ వాహనాలు ఉపముఖ్యమంత్రికి చెందినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.