వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి నిత్యావసరాల కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తామని చెప్పారు. ఇళ్లు, షాపులు పూర్తిగా మునిగిపోయి నష్టపోయిన వారిని ఆదుకుంటామని చెప్పారు.