AP: న్యూ ఇయర్ వేళ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు దశలవారీగా కౌన్సెలింగ్ చేస్తున్నానని తెలిపారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు పదే పదే హెచ్చరిస్తున్నా అని స్పష్టం చేశారు. సమాజానికి హానికరమైన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.