దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త ఏడాదిని లాభాలతో ఆరంభించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా, మారుతీ సుజుకీ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్ 368.74 పాయింట్లు లాభపడి 78,507.41 వద్ద ముగియగా నిఫ్టీ 98.10 పాయింట్ల లాభంతో 23,742.90 వద్ద ముగిసింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 85.64గా ఉంది.