దేశంలో వస్తు,సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయ స్థాయిలో నమోదయ్యాయి. గత డిసెంబరు నెలలో రూ.1.77లక్షల కోట్ల జీఎస్టి వసూలైంది. 2023 డిసెంబరు (రూ.1.65లక్షల కోట్లు)తో పోలిస్తే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు బుధవారం విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ డేటా వెల్లడించింది. ఇందులో సీజీఎస్టి రూపంలో రూ.32,836 కోట్లు, SGST రూపంలో రూ. 40,499 కోట్లు సమకూరాయి.