యెమెన్‌లో హత్య కేసులో దోషిగా తేలి, ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిషా ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హతుడి కుటుంబాన్ని ఒప్పించి నిమిషాను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో తన భార్య క్షేమంగా స్వదేశానికి తిరిగొస్తుందని నిమిషా భర్త టామీ థామస్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన కూతురు గతంలో తల్లితో గడిపిన రోజులను గుర్తుచేసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నదని, తల్లి ప్రేమను మిస్సవుతోంది అని అన్నారు.