TG: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జహీరాబాద్ బైపాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు చౌరస్తా దాటుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారిలో 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.