ఫార్ములా-ఈ రేపు వ్యవహారంలో ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'ఈ కేసు ఓ లొట్టపీసు కేసు. ఏసీబీ పెట్టిన అవినీతి లేని మొదటి కేసు ఇది. ఏడాదిగా ప్రయత్నించి నాపై ఆరో అంశంపై కేసు పెట్టారు. ఫార్ములా-ఈ రేసును అప్పుడు మంత్రిగా నేను అనుమతిస్తే ఇప్పుడు రద్దు చేశారు. నేను తప్పు చేస్తే రేవంత్ రెడ్డిది ఎలా ఒప్పు అవుతుంది. 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు.