

అనపర్తి: మీ మాజీ ఎంపీపీ ఎందుకు రాజీనామా చేశారు
మూడున్నర ఏళ్లుగా మీ ఎంపీపీ చేసిన అభివృద్ధి ఏమిటనీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ వైయస్సార్సీపి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని మంగళవారం ప్రశ్నించారు. గతంలో ఎంపిటిసిలకు, ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ ఇవ్వకుండా కనీస గౌరవం ఇవ్వలేదేని దుయ్యబట్టారు. ముందు మీ ఎంపీపీ ఎందుకు రాజీనామా చేశారో, మీ అభ్యర్థి ఎందుకు నామినేషన్ వేయలేదో కనుక్కోoడి అని విమర్శించారు.