పల్లె పండుగతో గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే

77చూసినవారు
పల్లె పండగతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి, బిక్కవోలు మండలాల్లోని వివిధ గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్