తూర్పుగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గంలో జరిగే ప్రజారోగ్య వైద్య సేవల్లో తమ వంతు పాత్ర పోషించేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చిన స్వచ్చంద సేవా సంస్థ ఆమెన్ ట్రస్ట్ నిర్వాహుకులను గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు అభినందించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కార్యక్రమాలన్నింటిలోనూ తాము పాల్గొని ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్యేకి తెలిపారు.