కొవ్వూరు: సైబర్ క్రైమ్‌పై అవగాహన
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ దేవకుమార్ మంగళవారం తెలిపారు. కొవ్వూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పట్టణ సీఐ విశ్వం ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ "ప్రస్తుతం యువతీ యువకులు సైబర్ క్రైమ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మీ పర్సనల్ డేటా ఎవరికి కూడా తెలియపరచకూడదని, వాట్సాప్ లింకులను ఓపెన్ చేయవద్దని" సూచించారు.