ప్రభుత్వాలు మారినా కొవ్వూరు యానాది కాలనీ వాసుల సమస్యలు పరిష్కారం కావట్లేదని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు మల్లికా తెలిపారు. సోమవారం యానాదికాలనీ సమస్యలపై ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కాలనీ మహిళలు మాట్లాడుతూ కాలనీలో ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయని, మహిళలకు మరుగుదొడ్లు నిర్మించాలని, మంచి నీటిని అందించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు.