గురు పౌర్ణమి సందర్భంగా ఏలేశ్వరం మండలంలోని సిరిపురం గ్రామంలో ఉన్న సాయి బాబా ఆలయంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సూతి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.