రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఉదయం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.