ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాజమండ్రిలో కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. బుధవారం రాజమండ్రిలోని పుష్కరాల రేవు దగ్గర నుంచి గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వరకూ ఈ ర్యాలీ సాగింది. ముందుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి శాంతికి చిహ్నమైన పావురాలను ఎగురవేసి ర్యాలీ ప్రారంభించారు.