పురుషోత్తపట్నం రైతులకు బాసటగా సీఎం: బత్తుల

73చూసినవారు
సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిమిత్తం భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ, ఇరిగేషన్ మంత్రులకు ఈ సమస్యపై వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి వారు హామీ ఇచ్చారని బత్తుల అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్