ఆక్రమణల తొలగింపు చేపడితేనే రైతుల పంటలు వర్షాల సమయంలో ముంపునకు గురికాకుండా ఉంటాయని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. అల్లవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అధికారులతో కలిసి అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై ఈ కార్యక్రమానికి 42 అర్జీలు వచ్చాయని ఎంపీడీవో కృష్ణమోహన్ తెలిపారు.