అమలాపురం లోని జిల్లా కలెక్టరేట్ సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజా సమస్యలపై 213 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన గడువు లోగా ప్రజలు అందించిన సమస్యలపై అందించిన అర్జీలకు సంబంధిత ప్రభుత్వ శాఖల పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.