అమలాపురం: స్మశాన వాటికకు రోడ్డు నిర్మించాలని ధర్నా

67చూసినవారు
దళితుల స్మశాన వాటికకు రోడ్డు నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమలాపురంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఉప్పలగుప్తం మండలం వలసవెళ్లిలో బీమ్ నగరం, వడ్డీ వారిపేట, బీరవారి పేటలో 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. తమ కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే స్మశానానికి తీసుకు వెళ్లడానికి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. రోడ్లు నిర్మించాలని బీఎస్పీ నేత మోహన్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్