అమలాపురం: నెలాఖరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: జేసీ

73చూసినవారు
అమలాపురం: నెలాఖరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: జేసీ
సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభించనున్నట్లు జేసీ నిశాంతి తెలిపారు. సోమవారం అమరావతి నుంచి పౌరసరఫరాల కమిషనర్ వీర పాండ్యన్ దూర దృశ్య సమావేశం నిర్వహించి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అమలాపురం నుండి ఆమె పాల్గొన్నారు. ఈ నెలాఖరు నుంచి వచ్చే అయిదు నెలల కాలంలో ఎప్పుడైనా ఈ ఉచిత సిలిండర్ పొందవచ్చని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్