చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో నారా రామ్మూర్తి నాయుడు దశదిన కర్మకు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల అనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు గురువారం హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేష్ ను కలిసి కొద్దిసేపు మాట్లాడారు.