కోనసీమ జిల్లాలోని కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆయన రైల్వే లైన్ నిర్మాణ పనుల పురోగతిపై రెవెన్యూ, రైల్వే అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రైల్వే లైన్ నిర్మాణ పనులపై ఆయన సూచనలు చేశారు.