అమలాపురం రూరల్ మండలం బండారులంక కందులపాడు కాలనీలో సీసీ రోడ్డు మధ్యలో కొంత మంది ఇనుప స్తంభాలు పాతి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ స్థానికులు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. 8 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంబులెన్స్, సెప్టిక్ ట్యాంకు, నీళ్ల ట్యాంకు చెత్త బళ్ళు ఆటోలు ఇతర వాహనాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.