కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, 426 గ్రామాల్లో నాలుగు లక్షల 93, 465 గృహాలను సందర్శించి పశుగణనను నమోదు చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఆయన అంబాజీపేట మండలంలోని నందంపూడిలో సోమవారం పశుగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన సర్వే ఇంత వరకు 16. 9 శాతానికి చేరుకుందన్నారు. 2025 ఫిబ్రవరి నాటికి సర్వే పూర్తి చేస్తామన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.