అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ వెళ్లే నూతన బస్సు సర్వీసును అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సు సర్వీస్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, తదితరులు పాల్గొన్నారు.