అమలాపురం పట్టణంలోని ఈదరపల్లిలో వంతెన వద్ద శనివారం ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాల రద్దీ పెరగడంతో ఒక్కసారిగా వాహన చోదకులు ఉక్కిరి బిక్కిరయ్యారు. భారీ వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతి పండుగకు వచ్చే వాహనాలతో రద్దీతో వంతెన వద్ద సుదూర ప్రాంతం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా సేపు ట్రాఫిక్ ఆగిపోవడంతో ప్రజానీకం ఇబ్బంది పడ్డారు.