మామిడికుదురు: వెండి మకర తోరణం సమర్పణ

58చూసినవారు
మామిడికుదురు మండలం ఆదుర్రులో కొలువు తీరిన శ్రీసర్వమంగళ పార్వతి విశ్వేశ్వర స్వామి ఆలయంలోని అమ్మ వారికి మాజీ సర్పంచ్ ఉపాధ్యాయుల కామేశ్వరి, జగన్నాథ శాస్త్రి దంపతులు మంగళవారం వెండి మకర తోరణం సమర్పించారు. రూ. 6లక్షల వ్యయంతో నిర్మించిన ఎనిమిది కిలోల వెండి మకర తోరణాన్ని ఆలయ అర్చకులకు అందజేశారు. మకర తోరణానికి అర్చకులు వెంకటేశ్వరశర్మ, సుబ్రహ్మణ్యశర్మ సంప్రోక్షణ చేసి అనంతరం దాన్ని అమ్మ వారికి అలంకరించారు.

సంబంధిత పోస్ట్