పి. గన్నవరం మండలం నరేంద్రపురం ఉపకేంద్రం పరిధిలోని నరేంద్రపురం, పప్పులవారిపాలెం, కుందాలపల్లి, జి. పెదపూడి, ఊడిమూడిలంక, రాజులపాలెం, ఇసుకపూడి, బెల్లంపూడి, యర్రంశెట్టివారిపాలెం గ్రామాలకు శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు అమలాపురం విద్యుత్తుశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం. రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.