Jan 03, 2025, 04:01 IST/
కాలిఫోర్నియాలో కూలిన విమానం (వీడియో)
Jan 03, 2025, 04:01 IST
గత కొద్దీ రోజుల నుంచి వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కాలిఫోర్నియాలోని ఫులర్టన్లో ఓ వాణిజ్య భవనంపై చిన్న విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.