ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో వచ్చిన 2014 నుంచి 2024 వరకు ఉపాధి కల్పన 36 శాతం పెరిగిందని, 17.19 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ ప్రకటించారు. మొత్తం ఉద్యోగాల సంఖ్య 64.33 కోట్లకు చేరిందన్నారు. ప్రభుత్వ హయాంలో 2004 - 2014 వరకు ఉపాధి కల్పన రేటు ఏడు శాతమే ఉందని, కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.
2023–24 లోనే మోదీ ప్రభుత్వం 4.6 కోట్ల ఉద్యోగాలను సృష్టించగలిగిందని మంత్రి అన్నారు.