రైలు పట్టాలపై PUBG.. ముగ్గురు యువకుల మృతి

51చూసినవారు
రైలు పట్టాలపై PUBG.. ముగ్గురు యువకుల మృతి
PUBG ఆట పిచ్చి.. బిహార్‌లో ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ఫుర్కాన్ అలీ(14), సమీర్ అలీ (13), షాదాబ్(14) అనే టీనేజర్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలు పట్టాలపై పబ్‌జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. గురువారం సాయంత్రం వారిపై నుంచి రైలు వెళ్లడంతో అందరూ దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్