కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫులర్టన్‌లో ఓ వాణిజ్య భవనంపై చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.