నేటి నుండి నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కాగా జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఆహ్వానించకుండ ఎలా నిర్వహిస్తారని, ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం, నాయకులు అధికారులను నిలదీశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.